పరిస్తితి ఉన్నప్పటికిని మనం ఈ ఆదరణకరమైన వాక్యం మీద ఆధారపడవచ్చును

[By Aditya Swathi B.]

నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము

Joshua 1:5,6

The LORD said to Joshua … ‘I will not leave you or forsake you. Be strong and courageous’ (Joshua 1:5,6 – ESV).

గొప్ప నాయకుడైన మోషే చనిపోయిన తరువాత , బహు విస్తార జనాంగమైన ఇశ్రాయేలీయులను నడిపించుటకు యెహోషువా భయపడి ఉండవచ్చును. అందుకే దేవుడు అంత గొప్పగా ధైర్యం చెప్పెను. మన మందరం దేవుని వాక్యం నుండి బలం పొందవచ్చును

After the great man of God, Moses , died, Joshua might have been afraid to lead the great nation of Israel! That is why God had strengthened him with His Word. We can all draw strength from the Word of God.

ఆపద వచ్చినప్పుడు భయపడటం సహజం. కాని విశ్వాసులమైన మనకు అభయం ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు . ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని , తండ్రిని నమ్మినట్టు మనం దేవుని నమ్మవచ్చును. అలాంటి విశ్వాసం కోసం మనం దేవుని ప్రార్ధించాలి. పరిస్థితులని చూచి భయపడనట్టి ధైర్యం ఇమ్మని మనం ప్రభువును అడగాలి. దేవుడు ఇచ్చే ఆదరణను యెహోషువ, మోషే జీవితంలో చూచెను.

It is natural to be afraid when we are in trouble.But we have a God who stands for us ! We can trust Him as a child trusts his mother and father! We need to pray to God for such a faith! We have to ask Him to give faith that does not shake in calamity. Joshua has seen the assurance that comes from God in Moses’s life.

ఈరోజున మనం కూడా దేవుని వాగ్ధానాన్ని, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నమ్మవచ్చును. మన ప్రభువు తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించారు.

Today we can also trust God’s promises through His Son, our Lord and Saviour Jesus Christ. Jesus has shed His precious blood for us.

ఈ లోకంలో మనల్ని చాలా సంగతులు, మనుష్యులు భయపెట్టవచ్చును. మనం పని చేసే చోట , మన తోటి ఉద్యోగులు చాలా ఇబ్బంది పెట్టవచ్చును, ఆరోగ్యం బాగోలేకపోవచ్చును, ఆర్ధిక ఇబ్బందులు ఉండవచ్చును. ఏ పరిస్తితి ఉన్నప్పటికిని మనం ఈ ఆదరణకరమైన వాక్యం మీద ఆధారపడవచ్చును. ఆయన మన ప్రతి అడుగులోను తన చిత్తాను సారంగా మనకు విజయం చేకూర్చి పెడతాడు. మనం చేయ వలసినదంతా ఆయన అడుగు జాడల్లో నడవటమే! ఆ ప్రభువే మనకు రక్ష! ఆమేన్!

In this world many things may scare us, some people may frighten us, our colleagues in office may trouble us, sickness or financial difficulties may trouble us, what ever may be the situation in life we can depend on this promise of God. He will give us victory in all that we do according to His will. Only that we have to walk in His ways. Jesus is our refuge and our Saviour. Amen!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s